ఏ ప్రభూ! జీవము భావము దేహమూ అన్నీ నీలోనే దర్శిస్తున్నాను
ఓ చక్రవర్తి ద్వి సూర్య చంద్రులు త్రీ మూర్తులు నాల్గు దిక్కులు నీలోనే
పంచ పాండవ సైన్యం అరిషడ్వర్గాలు సప్త సముద్రాలు అష్ట దిక్పాలకులు
నవ గ్రహాలూ దశ అవతారములు ఏకాదశ గుణాపతి ద్వాదశ అర్దనారీశ్వరము
త్రయోదశ వేదములు చతుర్దశ కాలములు పంచ భూతాలూ సమస్తము నీలోనే
విశ్వముగా నీలో అనంత ముఖ వర్ణాలతో ఆత్మ భావ స్వభావాలతో అణువులుగా
సూక్ష్మ తేజ నక్షత్ర ప్రకాశముతో చూసేందుకు పాతాళ ఆకాశము కలిసిపోయాయి
నీ దర్శనముతో నాలో విశ్వము జీవము భావము దేహములోనే ధ్యానిస్తున్నాయి
నా శ్వాసను ధ్యానింపజేస్తూనే నేను నీలో చైతన్యమై మహా భావంతో నిలిచి ఉంటా
ప్రతి జీవి ధ్యానించేలా నాలోని భావాలు విశ్వము నుండి మేధస్సుకు చేరగలవు
No comments:
Post a Comment