మనం అనుకున్నవాటి కంటే కాలం కల్పించినవే అధికం
విశ్వ అణువులలో నేను ఒక అణువునై జీవిస్తున్నాను
ఒక అణువుగా నేను అనుకున్నది జరగాలంటే
మిగతా అణువులను నా ఆధిక్యతలో ఉంచుకోవాలి
మన చుట్టూ ఉండే అణువులు మన ఆధిక్యతలో లేకపోతే
మనం అనుకున్న వాటికి వాటి సహకారం లభించదు
ఒక్కో అణువు ఒక్కో లక్ష్యంతో జీవిస్తున్నందున
వాటికి మనం సహకరించము మనకు అవి సహకరించవు
ఒక్కో అణువుకు జీవిత ఆశయాలు ఎన్నో ఉంటాయి
జీవితమంతా ఆశయాలను నెరవేర్చుకోవాలనే తపిస్తుంటాయి
మన లక్ష్యానికి మన చుట్టూ ఉండే అణువుల ద్వారా ఆటంకము కలగరాదు
మనం గొప్ప భావాలతో ఉంటే మన చుట్టూ ఉండే అణువులు గొప్పగా ఉంటాయి
చుట్టూ ఉండే అణువులు గొప్పగా ఉన్నప్పుడే మన లక్ష్యానికి అవకాశం లభిస్తుంది
అవకాశమున్నప్పుడే ప్రయత్నిస్తే మన లక్ష్యం నెరవేరుతుంది జాగ్రత్త వహించండి
మనకు అవకాశం లేనప్పుడు మరో అణువుకు అవకాశం లభిస్తుంది
ఒక్కో అణువుకు ఒక్కో సారి అవకాశం లభిస్తూ లక్ష్యాలు నేరవేరుతూ ఉంటాయి
అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు ప్రయత్నాన్ని ఎప్పుడూ మానుకోవద్దు
మన లక్ష్యానికి అణువులు కాలం సహకరించేందుకు ప్రశాంతంగా ధ్యానించు
No comments:
Post a Comment