Monday, September 6, 2010

శ్వాస ఆగిపోతే మనస్సు ఏ స్థానమున

శ్వాస ఆగిపోతే మనస్సు ఏ స్థానమున ఎక్కడ ఎలా ఏ భావనతో ఆగిపోతుంది
శ్వాస ఆగిపోయే భావన మేధస్సుకు తెలుస్తుందా ఎలా శూన్యమవుతుంది
శ్వాసకు మనస్సుకు ఎటువంటి సంబంధము ఉన్నది ఎలా జీవించగలిగాయి
శ్వాసతోపాటు మనస్సు ఆత్మ మూడు శరీరాన్ని వదిలి ఎక్కడికి పోతాయి
శ్వాస జీవముగా మనస్సు చలనముగా ఆత్మ రూపముగా మనలో ఉంటాయి
ఈ మూడా కలిస్తేనే మనలో భావన మొదలవుతుంది అలాగే జీవించగలుగుతాము
మూడింటిలో ఒకటి లేకున్నా శరీరము నిలవదు ఏ జీవి జన్మించదు

No comments:

Post a Comment