జగతిలో ఎలా జీవించాలి! ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఆచరించాలి
బాల్యమున తల్లిదండ్రులే శుభ్రతతో జీవించేలా పెంచాలి
శాఖాహార ఆహారంతో పాటు ప్రశాంతంగా నిద్రించేలా చూడాలి
మంచి మాటలు మంచి అలవాట్లు మంచి ప్రవర్తనతో పెంచాలి
ఎప్పటికీ చక్కని వస్త్రాలతో శరీరాన్ని శుభ్రతగా ఉంచుకోవాలి
క్రమ శిక్షణ ఏకాగ్రత వినయం విధేయతలకు అవగాహన కల్పించాలి
ఐదవ సంవత్సరం నుండి చదువు అలాగే ధ్యాన శిక్షణ ప్రారంభించాలి
లోకజ్ఞానం తెలుపుతూ పద ఉచ్చారణ మాట తీరు స్పష్టంగా ఉండాలి
స్నేహితులతో ఉన్నప్పుడు కూడా శుభ్రత మాట తీరు ఆటలు చక్కగా ఉండాలి
ఏ దురలవాట్లను బయట కల్పించనట్లు నేర్చుకోలేనట్లు భోధించాలి
పదహేను సంవత్సరాలు తల్లి దండ్రుల ఆధీనంలో మెలగాలి
పదహారవ సంవత్సరం నుండి చదువుతో పాటు సమాజాన్ని అర్థం చేసుకోవాలి
ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉండాలి
ప్రతి రోజు వ్యాయామం చేస్తూ శరీర సౌష్టవాన్ని చక్కగా ఉంచుకోవాలి
ఆరోగ్యానికి ఎక్కువగా ఫలహారములు కూరగాయలు తీసుకోవాలి
ప్రతి పనిని సులువుగా చేసుకొనుటకు శరీరము అనుకరించాలి
మేధస్సును ఎప్పుడూ సోమరి లేకుండా ఉత్తేజంగా ఉంచుకోవాలి
ప్రతి కార్యాన్ని శుభ్రతగా కార్య కారణ విధానంతో చేయగలగాలి
మీ నుండి ఇతరులు ఎన్నో విషయాలను గ్రహిస్తూ నేర్చుకోవాలి
ఎవరికి తెలియని కొత్త విజ్ఞానాన్ని సూక్ష్మంగా పరిశీలించి కనుక్కోవాలి
సూర్యోదయ సూర్యాస్తములను చంద్రున్ని నక్షత్రాలను ఆకాశాన్ని మేఘాల ఆకృతులను తిలకిస్తూ ఉండాలి
ప్రతి జీవి జీవించే విధానాన్ని జీవిత రహస్యాలను తెలుసుకుంటూ ఉండాలి
ఆకాశంలో పక్షుల విహారాలను ఎన్నో విధాల గొప్పగా తిలకించాలి
ఎలా కష్టపడితే మన జీవితం అలా మలుపు తిరుగుతూ మహా గమ్యాన్ని చేరుకోవాలి
సామాన్య మానవుడిలా కాకుండా గొప్ప ఆధ్యాత మహాత్మలా విశ్వమున నిలిచిపోవాలి
ధ్యాన సాధన పెంచుతూ చదువుకుంటూనే మంచి భవిష్య ప్రణాళికలతో ఎదగాలి
ఎన్నో ప్రయాణాలను చేస్తూ అన్ని ప్రాంతాల మనుషులను అర్థం చేసుకుంటూ వెళ్ళాలి
గొప్ప వాళ్ళ జీవితాలను చరిత్రను శాస్త్రీయ శాస్త్రవేత్తలను గురించి అనుభవాన్ని గ్రహించాలి
మంచి ఆధ్యాత్మక అనుభవ సాంకేతిక సమాజ స్థితి పుస్తకాలు చదువుతూ ఉండాలి
ప్రపంచం నలుమూలల జరిగే విషయాలను సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి
అవసరంలేని వాటిని త్వరగా వదులుకునేలా ఎక్కువగా ఆలోచించకుండా ఉండాలి
మంచి కార్యాలపై పట్టుదల ఓపిక సమయస్పూర్తి కృషి అనుభవ విజ్ఞానం ఉండాలి
సందేహాలను గొప్పవాళ్ళను గురువులను అడుగుతూ ప్రయోజనం చెందాలి
కోప ద్వేషాలు అసూయ ఇలాంటివి లేకుండా అందరితో కలిసిపోయేలా జీవించాలి
ముప్పై సంవత్సరాల లోపు పెళ్లి పిల్లలు ఇతర కుటుంబ సమస్యలను క్రమ పరచుకోవాలి
మన పిల్లలను కూడా ఇదేవిధంగా పెంచుతూ స్నేహా సంబంధాలను ధృడ పరచుకోవాలి
ఇటు పిల్లల భవిష్యత్ అటు మన భవిష్యత్ ను అర్థం చేసుకుంటూ జీవించగలగాలి
అజ్ఞానానికి అనర్థాలకు ఆవేశాలకు చాలా దూరంగా ఉండేలా ఎరుకతో ఉండాలి
నలభై సంవత్సరాల తర్వాత విశ్వ విజ్ఞానం కోసం అన్వేషణ చేస్తూ ఉండాలి
ప్రకృతిని ఆకాశాన్ని పరిశీలిస్తూ అవగాహన చేస్తూ విశ్వ భావాలను సేకరించాలి
దేనిని దుర్వినియోగం చేయక అవసరమైన వాటినే సమకూర్చుకోవాలి
ప్రతి వస్తువుకు ప్రకృతికి విలువను ఇస్తూ వాటిని రక్షిస్తూ ఉండాలి
ప్రతి దాని యొక్క ఉపయోగాలను ఇతరులకు తెలుపుతూ ఉండాలి
లోకంలో జరిగే అద్భుతాలను గ్రహిస్తూ ఎన్నో భావాలను గ్రహిస్తూ ఉండాలి
ఎన్నో చరిత్రలను శాస్త్రవేత్తల జీవితాలను రాజ్యాంగ హక్కులను తెలుసుకోవాలి
ధ్యాన సాధనమున ఎన్నో విషయాలను పరిశీలించి విశ్వ రహస్యాలను తెలుసుకోవాలి
యాబై సంవత్సరాల తర్వాత పిల్లలకు మంచి ఉద్యోగం జీవిత లక్ష్యాన్ని కల్పించాలి
పెళ్ళిళ్ళు చేసి మంచి జీవితాన్ని ఆరంభించేలా చూసి వారి పిల్లలకు ఆదర్శం కావాలి
అరవై సంవత్సరాల తర్వాత చిన్న కార్యాలను చేసుకుంటూ సమాజానికి సేవలను అందించాలి
సమాజంలో మంచి మార్పు ఆధ్యాత్మ లక్షణ భావాలను నెలకొల్పాలి
సమాజలో ఏర్పడే సమస్యలకు పరిష్కారాన్ని తెలుపుతూ ఉండాలి
భవిష్యత్ కు ఉపయోగపడేలా క్రమ కారణ కాల ప్రణాళిక ను సమాజానికి తెలపాలి
శక్తి తక్కువయ్యే కొద్ది విశ్రాంతి తీసుకుంటూ ప్రకృతిని ఆశ్వాదిస్తూ ఉండాలి
రోగాలను వీలైనంత త్వరగా వదిలించుకోవాలి లేదంటే వదిలించుకునే శక్తిని కోల్పోతాము
రోగానికి తగిన ఆహారమే భుజించాలి వేటిని రుచించినా రోగము వీడదు
మన ఆశయాలను జీవన జీవిత విధానాన్ని ఆస్తులను గొప్ప విషయాలను మన వాళ్లకు తెలపాలి
భార్య ఐతే భర్తతో భర్త ఐతే భార్యతో ఒకరు లేనప్పుడు ఎలా జీవించాలో చర్చించాలి
మనం చనిపోతే భవిష్యత్ సమస్యలకు ఎవరిని కలవాలో పిల్లలకు తెలపాలి
ధైర్యంగా జీవించాలని మన వాళ్లకు మనమే సూచనలను జాగ్రత్తలను తెలపాలి
ప్రయాణాలను తగ్గిస్తూ ధ్యానము చేస్తూ ఆరోగ్యంగా సుఖంగా మరణించాలి
మూడ నమ్మకాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా విశ్వ విజ్ఞాన ధ్యాన బాటలో జీవితాన్ని సాగించాలి
విశ్వమున ప్రతి ఒక్కరు సుఖంగా జీవించి చైతన్యం కావాలనే నా విశ్వ భావన
జనాభ అధికమవరాదు అజ్ఞానం అనర్థం కలగరాదు జీవితాలు చెదిరిపోరాదు
No comments:
Post a Comment