విశ్వమున జీవులకు ఎన్ని రోగాలో చిత్రముగా ఉన్నాయి
మానవునికే వైద్య సహకారాలు అందుతున్నాయి
పెంచుకున్న జీవులకు కూడా వైద్య సదుపాయాలు కలవు
సమాజమున కనిపించే జీవులకు వైద్య సహకారం లేదు
సమాజంలో జీవుల రోగాలు వాటి కష్టాలు అనిర్వచనీయం
ఎన్నో సదుపాయాలున్నా వైద్యం అందని జీవులు ఎన్నో
ఆర్థికంగా పనిచేసేవారికి ఇతర జీవులు రోగాన్ని తెలుపలేవు
ప్రతి జీవి ఏనాడు సుఖంగా జీవిస్తుందో తెలియుట లేదు
ప్రతి జీవి ఆరోగ్యం కోసం నిత్యం ధ్యానిస్తూ జీవించండి
No comments:
Post a Comment