విశ్వమున ఆనాడు దాగిన రూపాలను త్రవ్వుతూ వస్తున్నారు
ఎన్నో మహా రూపాలు మారిపోయాయి ఎన్నో మరో రూపాలను సృష్టిస్తున్నారు
సహజ రూపాలను కృత్రిమ రూపాలుగా మార్చుకుంటూ వస్తున్నారు
విశ్వ రూపానికి ఎన్నో తగ్గులు ఎక్కడెక్కడో ఏర్పడుతున్నాయి
ఏ రూపం ఎలా చెదిరిన చివరికి మరల మట్టిలోనే కలిసిపోతుంది
చెదిరిపోయే రూపాల కోసం సహజంగా ఉన్న రూపాలను మార్చవద్దు
విశ్వ రూపాలలోని భావాలను ప్రశాంతంగా విజ్ఞానంతో గ్రహించి చూడండి
విశ్వాన్ని ఆర్థికంగా దోచుకోవద్దు ప్రకృతిని కనిపించకుండా చెయ్యొద్దు
No comments:
Post a Comment