నగరముల యందు సరైన ప్రణాళిక లేకపోతే సమస్యలెన్నో
వాహానాల కాలుష్యం ప్రాణ వాయువును హరించి వేస్తుంది
వర్షాల నీటి ప్రవాహాలు ఇంటిలోనే సాగిపోయి రోగాలకు నిలయమే
సరైన నిద్ర ఆహారాలు వసతులు ఆలోచనలు లేకుండా పోతాయి
మురికి కాలువలు ఎక్కువై జీవించుటకు వీలు కాకుండా పోతుంది
చెత్త పెరుగుతూ నడవాతానికి వీలు కాని దుర్వాసనలు ఎన్నెన్నో
శిరస్సుల జ్ఞానేంద్రియాలు పనిచేయక జీవించుటకు అవస్థాలెన్నో
జన సంఖ్య ఎక్కువై సరైన జీవితాలు లేక కాలంతో సాగుతున్నారు
కష్టాలను చెప్పుకున్నా కనిపించే గాంధి వినిపించుకునే తెరెసా లేరు
కార్య కారణ క్రమ విదాన ప్రణాళిక లేక నగరాలు దుర్లభమే
ఆర్థికంగా పని చేస్తున్నంత కాలం సమాజాలు ఏనాటికి మారవు
సాంకేతిక విజ్ఞానంతో పాటు దోచుకోవడం మోసాలు ఎక్కువవుతున్నాయి
నాలో ప్రణాళిక ప్రపంచాన్ని మార్చే విధంగా ఉన్నా తెలుసుకునే వారు లేరు
No comments:
Post a Comment