Saturday, September 4, 2010

నా భావాలు అర్థం కావాలంటే

నా భావాలు అర్థం కావాలంటే ప్రశాంతంగా శ్వాసను గమనించాలి
గమనంతో మీ శరీరంలో ఆత్మ తత్త్వం కలిగి విశ్వ భావన మొదలవుతుంది
విశ్వ భావనతో మీలో సద్గుణాలు ఆరంభమై సరికొత్త జీవితం ప్రారంభమవుతుంది
కొత్త జీవితంతో మీలో కలిగే భావాలే నా భావాలుగా అర్థమవుతూ తెలుస్తాయి
భావాలలో పరమార్థాన్ని గ్రహించినప్పుడు మీలో మహా ధ్యాస ఉద్భవించును
ధ్యాసను ధ్యానముగా గమనించి సాధన చేస్తే మీలో విశ్వము ఏకమవుతుంది
శ్వాసలో విశ్వము ఓ నూతన లోకాన్ని సృష్టించుకొని ఆధ్యాత్మ జీవితాన్ని సాగించును -
ఆధ్యాత్మ జీవితంలో అనుభవంతో ఎలా జీవించాలో కాలమే తెలుపునని గమనించు

No comments:

Post a Comment