కాలానికి ముందే మర్మముగా ఎన్నో వేల కోట్ల యుగాలుగా భావనతో జీవించాను
భావనకు స్వభావ శక్తి తత్త్వం కలిగి శూన్యమై ఓ కొత్త భావన ఆరంభమైనది
నేను ఆనాడు భావనగా జీవించిన కాలానికి ప్రమాణాలు గమనించలేనివి
ప్రస్తుత కొత్త భావనకై కాలాన్ని తెలుసుకొనుటకు ఎన్నో సృష్టించాను
సృష్టించుటలో విశ్వమై విజ్ఞాన ప్రమాణాలతో జీవుల జీవితాలు సాగిపోతున్నాయి
నేను జీవించినట్లు ఏ జీవికి జీవిత కాలం లేనందున నేటి వరకు కాల సమయమెంతో -
నేడు సాగుతున్న కాలం కన్నా ఆనాటి నా భావన జీవించిన కాల సమయమే అధికం -
No comments:
Post a Comment