విశ్వమున ఎవరు అక్కడ నా మాటలు వినిపిస్తున్నాయా
మాట్లాడటం లేదే ఎందుకు శబ్దాన్ని చేస్తూ వెళ్ళిపోతున్నారు
పంచ భూతాల ఆత్మ విజ్ఞానులైతే ఆగండి నాతో మాట్లాడండి
మేఘాలలో మెరుపు కనబడుతున్నదేగాని మీరు కనిపించుటలేదు
అత్యంత ఉన్నత ఎత్తైన స్థానమున నిచియున్నా కనిపించుట లేదే
నక్షత్ర సూర్య చంద్ర గ్రహాలన్నీ కనిపిస్తున్నా మీ రూపం కనిపించుటలేదు
విశ్వమున ఏ రూపంతో ఎక్కడ ఎలా ఏ వర్ణంతో మెరుస్తూ ఉన్నారు
ఎందుకు నాకే మీ ధ్వనులు వినబడుతున్నాయి ఒక్కసారైనా కనిపించరా
మీ రూప దర్శనమునకై నా శ్వాసను మహా ధ్యాసతో గమనిస్తున్నా
ధ్యాసలో విశ్వమున ఏ రూపములేక నా రూపమే శ్వాసతో వినిపిస్తున్నది
No comments:
Post a Comment