Thursday, September 2, 2010

విశ్వమున ఆలోచన ఎక్కడ నుండి

విశ్వమున ఆలోచన ఎక్కడ నుండి కలుగుతున్నదని చెవిలో కర్ణ బేరి అన్వేషణ
నేత్రములో ఉన్న వర్ణ కణాలకైనా ఆలోచనలు కనబడుతున్నాయనే అన్వేషణ
నాసికములో వాసన గుణమైనా పసిగడుతుందా అని శ్వాసతో అన్వేషణ
నోటి రుచులకైనా ఆలోచన తెలుస్తుందని నాలుక ఎదురు చూస్తూనే అన్వేషణ
జ్ఞానేంద్రియాలు ఎన్నో అన్వేషణలు చేస్తున్నా మేధస్సుకు ఎలా చేరుతుందో
విజ్ఞాన ఆలోచన ఎక్కడ నుండి కలుగుతుందని మేధస్సుకు ఇంకా ప్రశ్నార్థకమే
" మనస్సు యొక్క అన్వేషణలో ఆలోచన కలిగి మేధస్సుకు చేరుతుంది "
మనస్సు అన్వేషించే మార్గం విశ్వమున ఎలాగైనా ఎక్కడ నుండైనా కలగవచ్చు
జ్ఞానేంద్రియ విచక్షణలే కాక శరీర కణ భావాల పంచ భూతాల సైతం కలుగును
భావ మార్పులలో ఉన్న అర్థమే ఆలోచనగా మానవ మేధస్సులో జరిగే విజ్ఞాన ప్రక్రియ
మనస్సు లేనిది ఎదుగుదలలేని నిర్జీవ రూపముతో ఒకే భావన కలిగి ఉంటుంది

No comments:

Post a Comment