ఓ ఆకాశమా విశ్వాన్ని ఎందుకు కప్పి ఉన్నావు
విశ్వమున దాగిన ఎన్నో మహా రూపాలు కనిపించకున్నాయి
సూర్య చంద్రులు నక్షత్రాలు మాత్రమే కనిపిస్తున్నాయి
మేఘావృత ఆకార రూప వర్ణాలు ఇంద్రధనుస్సు అప్పుడప్పుడు కనిపిస్తాయి
ఇతర గ్రహాలు నక్షత్రాల గుంపులు ఉపగ్రహాలు ఎందుకు కనిపించుటలేదు
ఇంకా ఏవేవి ఉన్నాయో మేధస్సుకు అర్థమగుటలేదు కంటికి కనిపించుటలేదు
ఏ లోకాలున్నాయో చెప్పుకునేందుకే ఉన్నాయని భావిస్తున్నామా ఊహాతీతమా
ఇంకా నా విజ్ఞాన మేధస్సు ఎన్నో తెలుసుకోవాలని విశ్వంలో అన్వేషిస్తూనే ఉన్నది
నీవు ఉన్నందువల్ల ఎదిగే జీవికి ఉపయోగమని గ్రహిస్తూ నిన్నే తిలకిస్తున్నా
No comments:
Post a Comment