అందరూ వ్యాపార పరంగానే ఆలోచిస్తున్నారు గాని ఆ తర్వాత జరిగే కార్యాలు ఏవి
తర్వాత జరిగే కార్యాలకు విశ్వమున ఎలాంటి ప్రభావాలు ఏర్పడుతూ వస్తున్నాయి
ఎటువంటి సమస్యలతో ఏ విధంగా కాలం ఎలా వెళ్ళుతుందో కాల ప్రభావాలకే తెలుసు
వ్యాపార పరిశ్రమల ద్వారా విశ్వం ఏ విధమైన మార్పులతో వెళ్ళుతుందో గమనించారా
వాతావరణ కాలుష్యం అశుభ్రత సమాజం ఆర్ధిక ఆహార విద్యా సమస్యల ఇబ్బందులెన్నో
ప్రతి పని ద్వారా కలిగే ప్రభావం ఏమిటి వాటి నుండి కలిగే సమస్యలను ఎలా తొలగించుకోవాలి
ప్రతి పని తర్వాత దాని ప్రభావాలను చివరి దాకా ఆలోచిస్తే ఆరోగ్య పరమైనా జీవితం లభిస్తుంది
విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకోండి విశ్వ ప్రభావాలను గుర్తించండి విశ్వ సమాజాన్ని మార్చుకోండి
No comments:
Post a Comment