నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు
ప్రతి సంవత్సరం నూతన భావాలతో సాగిపోవాలనే ప్రతి ఒక్కరిలో కలిగే ఆశలెన్నో
సూర్యుడు ఉదయిస్తున్నట్లు మానవుడు ఉదయించాలని ఎన్నో సార్లు అనుకోవడమే
జీవితం విఫలం కావడంతో నిరాశ చెందుతూ జీవిస్తున్నప్పుడు మళ్ళీ కొత్త భావాలు కలగాలి
సూర్యోదయంతో కలగక పోయినా నూతన సంవత్సరంతో కొత్త భావాలు కలగాలనే చిన్న ఆశ
నూతన భావాలే మహా గొప్ప విజయాలకు స్పూర్తినిస్తాయి అలాగే మేధస్సును స్పందిస్తాయి
జీవితం ఎలా సాగుతున్నా మీ భావాలు సూర్యునిలా ఎల్లప్పుడూ సాగాలని నా సూర్య తేజస్సులు
No comments:
Post a Comment