నా నుండి తొలగిపోయే వ్యర్థం పంచభూతాలో చేరి శూన్యమై పోవాలని నా విశ్వ భావన
వీలైనంత త్వరగా శూన్యమైపోతే ఎటువంటి అజ్ఞాన భావాలు లేక ఏ అనారోగ్యం కలగదు
విశ్వమున సూర్య చంద్రులు గాలి చెట్లు వర్షం ప్రకృతి వివిధ రకాలుగా ఎన్నో భావాలతో
వ్యర్థపు మలినాన్ని శుభ్రం చేస్తూ మరో చోట నుండి విజ్ఞాన భావాలు కలిగేలా చేస్తాయి
ఆరోగ్య భావాల కోసం విశ్వ ప్రకృతి సూర్య రశ్మిని చంద్ర కాంతిని గాలిని వర్షాన్ని
స్వచ్ఛమైన ప్రాణ వాయువును వివిధ స్వభావాలతో కలిపిస్తూనే ఉంటుంది
మనం మహా గొప్పగా ఆలోచిస్తూ వివిధ గొప్ప కార్యాలతో సాగుతున్నామంటే
విశ్వ తత్వాల భావ స్వభావాల అనూహ్య పర్యావరణం సూక్ష్మంగా ఎన్నెన్నో
అశుభ్రతను వీలైనంత త్వరగా హాని లేకుండా శూన్యం చేసే మార్గాన్ని పాటించండి
No comments:
Post a Comment