ఏ కార్యాన్నైనా ముందస్తు ఆలోచనతో విశ్వ విజ్ఞానంగా ప్రారంభించు
కాలం ఎప్పుడూ ఏదో ఒక దానిని మరచిపోయేలా చేస్తుంటుంది
కొన్ని సందర్భాలలో పొరపాట్లు కలిగేలా కాలం వెంటాడుతూ ఉంటుంది
మరచిపోయినదే ముఖ్య ఆవశ్యకమై కార్యం ఆలస్యమవుతుంది
కార్య ప్రణాళికను ముందుగానే వ్రాసుకొని అలాగే జరిగేలా క్షుణ్ణంగా ఆలోచించండి
ఏ సమయానికి అది జరిగేలా కార్యం పైననే ఏకాగ్రత వహించాలి
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఏం మరచిపోతామో గమనించలేము
అన్నింటిని అన్ని వేళలో జ్ఞాపకంగా గుర్తు చూసుకుంటూ సాగండి
చేసిన పని లేదా పూర్తైన పనిని మళ్ళీ గమనించండి మరచినవి తెలుస్తాయి
పూర్తైన పనిని మళ్ళీ గమనించక పోవడం మేధస్సుకున్న అలవాటు
మహా కార్యాలను ముందస్తు ఆలోచనలతో క్రమ కార్య క్రమముగా చేయండి
అనుభవంతో కార్యాన్ని సాగిస్తూ కాల పరిస్థితులను గమనించడం అవసరమే
No comments:
Post a Comment