నేడు సూర్య తిలకాన్ని చూసి ప్రతి రోజు సూర్యోదయ సూర్యాస్తాములను మేధస్సులో దర్శిస్తున్నా
ఎర్రదనంతో అత్యంత వ్యాసార్ధంతో కనిపించే సూర్య భగవానుడు నా నేత్రాలకు విశ్వ తిలకముగానే
ప్రతి రోజు సూర్యున్ని దర్శించుటచే సూర్యో దయ కిరణాలు నా నుదిటిపై తిలకాన్ని పెడుతున్నాయి
విశ్వ తిలకాన్ని నేను దర్శించిన తర్వాతనే సూర్య కిరణాలు విశ్వ రూపాలను తాకుతూ పోతాయి
No comments:
Post a Comment