తల్లి కన్నా గొప్పది విశ్వమున ఏమున్నది తల్లి లేకుండా ఏది తెలియును
జన్మ లేనిదే మనకు ఏమి లేదు కనుకనే తల్లే విశ్వానికి మూల కేంద్రము
తల్లి ద్వారానే తర తరాల విలువలు విజ్ఞానం భావ స్వభావాలు ఇంకెన్నో
మనం దేనిని సృష్టించినా దాని గొప్పదనం తల్లిదే తర్వాతే మన విజయం
విశ్వంలో మనం ఏమి చేసినా దేనిని తిలకించినా అద్భుతమైనా తల్లిదే
బ్రంహా విష్ణు మహేశ్వరుల కన్నా గొప్పది తల్లియేనని జగమెరిగిన సత్యం
సృష్టికి మూలం దైవం తల్లియేనని విశ్వమున మర్మమైనా తల్లి తత్వమే
ఎప్పటికి తోడుగా విడిపోని బంధంతో నీతో జీవించే దైవమే తల్లి తండ్రులు
No comments:
Post a Comment