Friday, December 31, 2010

ఎన్ని విధాలైనా ఎన్ని రకాలైనా

ఎన్ని విధాలైనా ఎన్ని రకాలైనా నా మేధస్సులోని భావ స్వభావాలే
మనిషిలో కలిగే ఎన్నో ఆలోచనలలో ఎన్నో భావ స్వభావాలుంటాయి
ఒక ఆలోచనలో కూడా ఎన్నో భావ స్వభావ అర్థాలు దాగి ఉంటాయి
ఒక ఆలోచన ఒక్కొక్క మేధస్సులో ఒక్కొక్క అర్థాన్ని ఇవ్వగలదు
ఏ ఆలోచన ఏ అర్థాన్ని కలిగించినా విజ్ఞాన భావనతో స్వీకరించండి
ప్రతి ఆలోచన ఓ విజ్ఞాన కార్యానికే ఉపయోగపడాలని నా స్వభావం
నా మేధస్సులో ఉన్న భావాలు దాదాపుగా విజ్ఞాన అర్థాన్ని కలిగించేవే
అనంతమైన భావ స్వభావాలను ఎన్నో విధాల విశ్వ విజ్ఞానంగానే గ్రహిస్తున్నా

No comments:

Post a Comment