నూతన సంవత్సరం మొదలైనా కాలం ఒక్కటే తేది మాత్రమే మారుతున్నది
విశ్వ విధానం అలాగే ఆనాటి సూర్య చంద్రులతో సాగే జీవన భావ స్వభావమే
రోజులు ఒకేలా ఒకే కాల వ్యవధి సమయంతో విశ్వ గమన భ్రమణం సాగుతున్నది
చంద్రునిలో మార్పు ఉన్నదేమో గాని సూర్యునిలో మార్పు లేదు అలాగే జీవితం
మనలో మార్పు ఉంటుందేమో గాని విశ్వ విజ్ఞానంలో ఏనాడు మార్పు ఉండదు
మన జీవితం హాయిగా ఉండాలనే మనం ఇతరత్ర భావ స్వభావాలతో సాగిపోతాం
కాలం ఒక్కటే మన జీవిత కార్య క్రమాల భోగ భాగ్యాలు ఎన్నో విధాల సాగుతాయి
కాలానికి కొత్త దనం సూర్యోదయమే ప్రతి రోజు కొత్త భావాలతో విశ్వం సాగిపోవాలనే
జీవితంలో ఎన్నో సాధించాలనే వారికే ఎన్నో కొత్త భావాలు ఎల్లప్పుడూ కలుగుతాయి
కాలం వృధా చేయని వారికి ఏ రోజైనా ఏ సమయమైనా ఎక్కడైనా ఒకేలా ఉంటుంది
No comments:
Post a Comment