నా భావాలతో విశ్వమే చలిస్తుందని సూర్య చంద్ర నక్షత్రాలే ఆకాశంలో
విశ్వం చలించే భావ స్వభావాలు నా ఆత్మ స్థితిలో అనేకమై ఉన్నాయి
విశ్వ స్థితి కూడా నా ఆత్మ తత్వాలలో ప్రకృతి భావమై శ్వాసగా జీవిస్తున్నది
ప్రతి క్షణం నాలో విశ్వ రూపాలు వివిధ తత్వాల భ్రమణంతో అన్వేషిస్తూ ఉన్నాయి
విశ్వ ప్రదేశపు అంతరిక్షమున విశ్వ రూపాల భ్రమణం నా మేధస్సులో ఉన్నట్లుగానే
నేను తిలకించే ఆకాశం నా మేధస్సులో నిక్షిప్తమై ప్రతి విశ్వ రూపం నాలో చేరింది
నేను విశ్వమై నాలోనే విశ్వం ఉన్నట్లు సూర్య చంద్ర నక్షత్రాలు నా భావ స్వభావాలే
No comments:
Post a Comment