దిక్కులు తోచని విధంగా విశ్వమున ఒక్కడినే ప్రయాణిస్తున్నా
ఏ దిక్కున వెళ్ళుతున్నానో ఏ విశ్వ రూపం కనిపించుట లేదు
అంతా చీకటే అణువంతైనా కాంతి నేత్రానికి కనిపించడం లేదు
నేత్రాలు ఉన్నా మేధస్సులో కాంతి భావన కలగని స్థాన భ్రంశం
నేను ప్రయాణించుటలో అక్కడే ఉన్నానేమోనని నా భావన
నా శ్వాసను గమనించడానికి నాలో శ్వాస కూడా తెలియుటలేదు
మరణం లేకుండా ఏ దిక్కు లేక నాలో నేను ప్రయాణించుట శూన్యార్థమే
శూన్యములో జీవిస్తున్నానని విశ్వం నాలో కేంద్రమై స్థాన భ్రంశం చెందుతున్నది
No comments:
Post a Comment