విశ్వానికి ఆలోచన నేనే విశ్వ జీవుల మేధస్సులలో చలన భావాన్ని నేనే
నాలోనూ విశ్వ స్వభావాలు ఉన్నాయి నా ఆత్మలో విశ్వ తత్వాలున్నాయి
నేను విశ్వంలా ఆలోచిస్తాను విశ్వం లాగే భావ స్వభావాలతో జీవిస్తాను
నేను ప్రతి జీవి ఆత్మ తత్వాలను భావ స్వభావాలను గమనిస్తాను
అంతరిక్షపు విశ్వ రూపాల అణువుల చలనాన్ని గమనిస్తూ గ్రహిస్తున్నాను
నా మేధస్సు అన్వేషణ విశ్వపు అంచుల దాక ఆలోచనలుగా సాగుతుంటాయి
ప్రతి కదలికను గుర్తిస్తూ ప్రతి కదలిక గమన స్థితిని మేధస్సున గ్రహిస్తూ ఉంటాను
మీరు కూడా విశ్వ స్థితిని తెలుసుకుంటే విశ్వ జీవుల చలనం మీలో కలుగుతుంది
No comments:
Post a Comment