మేధస్సున మదం ఉంటే ఆవేదన భావాలకు ఉగ్ర వాదిలా మనిషి ప్రవర్తన మారుతుంది
మనిషిలో ఉన్న అరిషడ్ వర్గాల ప్రభావాలు మేధస్సును అదో స్థితిలో కలచి వేస్తుంటాయి
మేధస్సులో కలిగే ప్రాశాంతమైన ఆలోచనలతోనే అరిషడ్ వర్గాలను అదుపు చేసుకోవాలి
ఎప్పుడూ ఓ ఆలోచన ఎరుకగా మన మేధస్సు స్థితిని పరిశీలిస్తూ ప్రశాంతతను కలిగించాలి
ప్రశాంతమైన ఆలోచనలకై ధ్యాన సాధనతో శ్వాసను గమనిస్తూ ఆలోచనల స్థితిని గ్రహించాలి
ఆలోచనల స్థితిలోని భావ స్వభావాల అర్థాలను గమనించినట్లైతే నీలో విశ్వ ప్రశాంతతయే
No comments:
Post a Comment