ఆత్మ జ్ఞానంతో జీవించాలని ఆత్మ శ్వాసతో జన్మించా
శ్వాసతోనే ధ్యాస కలుగుతుందని ధ్యాసలోనే భావన ఉదయిస్తుంది
ధ్యాసలో ఉన్న భావనయే మనస్సుతో అన్వేషిస్తుందని తెలుసుకున్నా
మనస్సును ధ్యాసతో ఎన్నో భావాలను గమనిస్తూ అర్థాలను గమనిస్తున్నా
గమనార్థంలో ఎకాగ్రతకై శ్వాసపై ధ్యాస ఉంచి శూన్యార్థాన్ని గ్రహించా
శూన్యార్థంతో ఆత్మ జ్ఞానం కలిగి భావనగా విశ్వ భావాలతో అన్వేషిస్తున్నా
విశ్వ భావ స్వభావాలతో విశ్వ స్థితిని ఆత్మ స్థితిలో శ్వాసతో పొందుతున్నా
No comments:
Post a Comment