Tuesday, July 9, 2019

ఏమని తలచినా ఇదేనా అని గ్రహించెదవు

ఏమని తలచినా ఇదేనా అని గ్రహించెదవు
ఏదని తపించినా అదేనా అని స్మరించెదవు

ఎవరిని అడిగినా ఇదేగా గ్రహించమని తెలిపెదరు
ఎందరిని కోరినా అదేగా స్మరించమని తెలిపెదరు

ఎంత కాలం ఎవరు వేచినా ఎంత దూరం ఎవరు ప్రయాణించినా
అన్వేషణల పరిశోధన తెలిపేది జనన మరణ జీవన సిద్ధాంతమే   || ఏమని ||

విజ్ఞానంతో తలచినా అనుభవంతో తపించినా
వేదనంతో గ్రహించినా భావనంతో స్మరించినా

మేధస్సులో గమనం హృదయంలో చలనం ఉచ్చ్వాసకై సాగే జీవమే ప్రయాణం
ఆలోచనలో మననం దేహంలో స్మరణం నిచ్చ్వాసకై కదిలే పర జీవమే సమయం  || ఏమని ||

వివేకంతో పరిశోధించినా వినయంతో పరిశీలించినా
ప్రజ్ఞానంతో గమనించినా ప్రస్థానంతో వివరించినా

రూపంలో చలనం ఆకారంలో వైనం శ్వాస ధ్యాస బంధాల జీవన మార్గమే గమ్యం
దేహంలో మననం యోగంలో వైభోగం ధ్యాన జ్ఞాన వేదాల జీవిత లక్ష్యమే సౌఖ్యం  || ఏమని ||

No comments:

Post a Comment