Sunday, July 14, 2019

ఉచ్చ్వాసతో ఉదయిస్తున్నావా జీవమా

ఉచ్చ్వాసతో ఉదయిస్తున్నావా జీవమా
నిచ్చ్వాసతో అస్తమిస్తున్నావా ప్రాణమా

రూపంతో స్వభావమై ప్రకృతిలో జీవిస్తున్నావా
దేహంతో తత్వమై విశ్వతిలో ప్రయాణిస్తున్నావా

ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ధారణలతో నిత్యం శ్వాసిస్తున్నావా  || ఉచ్చ్వాసతో ||

ఉచ్చ్వాసపై ఏకాగ్రత కలిగేలా ధ్యాసతో గమనిస్తున్నావా
నిచ్చ్వాసపై ఏకాంతత కుదిరేలా శ్వాసతో ధ్యానిస్తున్నావా

శ్వాసే జీవమని ఉచ్చ్వాసయే ఉపయోగమని ఆలోచిస్తున్నావా
ధ్యాసే ప్రాణమని నిచ్చ్వాసయే అవసరమని తలచేస్తున్నావా   || ఉచ్చ్వాసతో ||

మేధస్సే లోకమని అన్వేషణయే విజ్ఞానమని ఉచ్చ్వాసపై గమనం చేస్తున్నావా
మేధస్సే విశ్వమని పరిశోధనయే విజ్ఞానమని నిచ్చ్వాసపై స్మరణం చేస్తున్నావా

రూపమే నిదర్శనమని భావమే విజ్ఞానమని ఉచ్చ్వాసపై ధ్యానం చేస్తున్నావా
దేహమే ఆదర్శనమని  తత్వమే విజ్ఞానమని నిచ్చ్వాసపై యోగం చేస్తున్నావా   || ఉచ్చ్వాసతో || 

No comments:

Post a Comment