పరిశుద్ధమైన విజ్ఞానమే పరిపూర్ణమైనది ప్రయోజనమైనది
విజ్ఞానం లేని పరిశుద్ధత అసంపూర్ణమైనది నిరర్థకరమైనది
ఒక వస్తువును పరిశుద్ధత కోసం మరొక చోట ఉంచితే ఆ ప్రాంతం ఆ వస్తువుకు ప్రమాదమైతే పరిశుద్ధత (పరిశుభ్రత) నిరర్థకరమైనది
వస్తువుకు ప్రమాదం అంటే ఆ వస్తువు మలినం చెందవచ్చు లేదా దొంగలించబడవచ్చు లేదా విరిగిపోవచ్చు లేదా మరొకరికి అడ్డుగా ఉండవచ్చు లేదా కాలిపోవచ్చు లేదా తడిసిపోవచ్చు లేదా మరకలు పడవచ్చు అలాగే ఎటువంట ప్రమాదం జరిగినా ఖర్చు పెరగవచ్చు శ్రమ పెరగవచ్చు [శుభ్రం చేయాలన్నా శ్రమించే సామర్థ్యం ఉండాలి]
ఒక వస్తువే కాదు ప్రతి వస్తువును సరిగ్గా ఉపయోగించుకోవాలి సరైన ప్రాంతంలో అనుకూలంగా ఉంచుకోవాలి ఎటువంటి ప్రమాదం ఎవరికీ ఎప్పుడూ కలగకుండా చూసుకోవాలి అలాగే ఆ వస్తువును ఎవరు వాడాలో వారే వాడుకోవాలి వాడిన తర్వాత దానిని సరైన ప్రాంతంలో ఉంచాలి అలాగే తరతరాల వారికి ఉపయోగపడాలి
ఒక వస్తువు పోతే ఇంకొకటి కొనవచ్చు అనే భావన ఆలోచన ఉన్నవారికి పరిశుద్ధత ఐశ్వర్యం అభివృద్ధి ఆరోగ్యం ప్రకృతి స్వభావం గురించి తెలిసి ఉండవు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment