Tuesday, July 8, 2025

ఏమిటో వాతావరణం వృద్ధాప్యాన్ని ఓడిస్తున్నది

ఏమిటో వాతావరణం వృద్ధాప్యాన్ని ఓడిస్తున్నది ఆరోగ్యాన్ని అనారోగ్యానికి గురిచేస్తున్నది 

నేటి జీవన విధానం మానవ ఆరోగ్య సామర్థ్యాన్ని తగ్గిస్తున్నది అలవాట్లతో శరీరాన్ని స్తంభింపజేస్తున్నది  

ఋతువులతో మార్పుచెందే వాతావరణం జీవులకు ఎన్నో విధాలా ప్రాణ హాని కలిగిస్తున్నది 

నేటి మానవుల గృహ నిర్మాణములు రహదారికి హెచ్చు తగ్గులతో ఉండడం వల్ల వర్షం నీరు కాలువల నీరు ఇంటిలోనికి ప్రవేశిస్తున్నాయి 

గృహ నిర్మాణములు చిన్నదిగా వెలుతురు లేనందువల్ల సూర్యరశ్మి ఇంటిలోకి ప్రవేశించక శరీరానికి తగిన నిరోధక శక్తి అందక అనారోగ్యం కలుగుతున్నది 

వృక్షములను వివిధ నిర్మాణముల వల్ల తొలగించుటచే స్వచ్ఛమైన ప్రాణవాయువు శరీరానికి అందటం లేదు 

కర్మాగారములు ప్రయాణ వాహనాలు అన్నీ కాలుష్యాన్ని పెంచుకుంటూ పోవడం వల్ల పరిశుద్ధమైన ప్రాణవాయువు ఒక నిమిషమైనను శ్వాసకు అందటం లేదు 

ఎక్కడ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలన్నా వ్యర్థమైన పదార్థాల నుండి దుర్వాసనలు ఊపిరిని కలుషితం చేస్తున్నాయి ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను కల్మషం చేస్తున్నాయి శ్వాసను దిగ్బంధం చేస్తున్నాయి ఆరోగ్యాన్ని ప్రమాదంగా మార్చేస్తున్నాయి 

ప్రకృతిని సరిగ్గా వినియోగించుకోక పొతే అనారోగ్యంతో పాటు అజ్ఞానం కూడా కలుగుతుంది అభివృద్ధి లేక పోతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment