తల్లి శరీరంతో పాటు శరీర అవయవాలకు కావలసిన పదార్థాన్ని సృష్టిస్తూ సంపూర్ణ జీవం పోస్తూ శ్వాసను ఉచ్చ్వాస నిచ్చ్వాసాలుగా దేహంలోనే సాగిస్తూ ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రయాసాలను గమనిస్తూ పరిపూర్ణ రూపంతో ఉత్తేజవంతమైన ఆరోగ్యంతో ఉల్లాస భరితంగా జీవించేలా జీవికి జన్మను ఇస్తుంది
జీవి నిర్మాణమంతయు వివిధ భావ తత్వాలతో తెలియని బంధాల వేదాలతో అనుభవాలకు అందని విధాన ప్రక్రియలతో తల్లియే శ్రమించుకుంటూ ఓదార్చుకుంటుంది ఊహాగానం చేసుకుంటుంది ఎన్నింటినో భరిస్తుంది
మానవునిలోనే విత్తనం ఉన్నది మానవునిలోనే వృక్షం ఉన్నది
వృక్షంలో మరో మానవుడు ఉన్నాడు విత్తనంలో మరో మానవుడు ఉన్నాడు
వృక్షంలో మరో విత్తనం ఉన్నది విత్తనంలో మరో వృక్షం ఉన్నది
విత్తనం మరో విత్తనాన్ని వృక్షం రూపంలో లేదా వృక్షంలా ఎదిగిన తర్వాత ఇవ్వగలదు
వృక్షం మరో వృక్షాన్ని విత్తనం రూపంలో లేదా విత్తనం వృక్షంలా ఎదిగిన తర్వాత ఇవ్వగలదు
ఒక విత్తనం ఒక వృక్షాన్ని ఇవ్వగలదు ఒక వృక్షం ఎన్నో విత్తనాలను ఇవ్వగలదు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment