పొదుపు లేని కుటుంబం శ్రమకు ఫలితం లేని అనారోగ్య వ్యవస్థతో సాగుతుంది
ప్రతి ఇంటిలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు పొదుపు చేస్తేనే ప్రగతి అభివృద్ధి ఆరోగ్యం శుభకార్యం కలుగుతుంది
పొదుపు లేకపోతే శ్రమించినదంతా ఖర్చు లేదా వృధా అవుతూ అభివృద్ధి విజయం లేక నిరంతరం శ్రమిస్తూనే అనారోగ్యం చెందుతారు
పొదుపు చేస్తే త్వరలోనే అభివృద్ధి చెందుతూ శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటూ సంతోషాలతో కుటుంబమంతా తరతరాలుగా జీవించవచ్చు
నిరంతరం శ్రమిస్తూ అనవసర ఖర్చులతో సాగిపోతే శ్రమించిన వారు వెళ్ళిపోతారు మిగిలిన వారు సంతోషాన్ని అనుభవిస్తారు లేదా ఇంకొకరు వచ్చి సుఖాన్ని అనుభవిస్తారు - శ్రమ ఒకరిది ఫలితం ఇంకొకరిది
శ్రమించినవారు సంతోషంగా జీవించాలని అనుకున్నా పొదుపు లేక (అనవసర ఖర్చులు) కోరికలన్నీ తీరలేక దూర తీరాలకు సాగిపోతారు
శ్రమించినవారు లేనప్పుడు ఐశ్వర్యం ఎంత ఉన్నా ఏమిటి ఎలా ఉన్నా దేనికి - జీవితాలు అర్థం కాని విధంగా
సాగిపోతున్నాయి
ఆనాడు పొదుపు చేసినవారే ఈనాడు సంతోషంగా జీవిస్తున్నారు [సంతోషంగా ఉన్నప్పుడు శ్రమించినవారు ఉంటేనే పరమార్థం]
ఈనాడు పొదుపు చేసేవారే రేపటి సంతోషంతో జీవిస్తారు [సంతోషంతో ఉన్నప్పుడు శ్రమించినవారు ఉంటేనే పరమార్థం]
శ్రమించి పొదుపు చేస్తేనేగా ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది కుటుంబం విజ్ఞానంతో సంతోషంగా ఎదుగుతూ సాగుతుంది
కొందరికి ఏమి లేకున్నా ఉన్నదంతా తమకు ఎంతో ఉందని ఖర్చు చేస్తుంటారు (ఉన్నదానిని) ఖాళి చేసుకుంటారు అలాగే శ్రమించే వారి శ్రమను పెంచుతూ అనారోగ్యంతో దూర తీరాలకు పంపిస్తారు - ఎంతవరకు ఎప్పుడు ఖర్చు చేయాలో అంతే పరిమితిలో చేయాలి అప్పుడే ఇంటికి సౌభాగ్యం ఐశ్వర్యం అనుభవం అభివృద్ధి
ఏమీ లేకున్నా ఉన్నదానిని (స్వల్పమైనది) ఎక్కువ కాలానికి ఉపయోగపడేలా అందరికి అందేలా చూసుకోవాలి
ఎంత ఉన్న ఉన్నదా దానిని కుటుంబం అభివృద్ధి చెందేలా సరిచేసుకోవాలి ఇంకో కుటుంబానికి (బంధువులకు - అమితంగా ఉన్నప్పుడు) ఆసరగా ఉండాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment