భావమే తెలియకపోతే తత్వాన్ని ఎలా గుర్తించగలవు
భావమే కదా ఆలోచన ఎటువంటిదో అర్థాన్ని తెలుపుతుంది
తత్వమే కదా ఆలోచన ఎటువంటిదో పరమార్థాన్ని తెలుపుతుంది
అర్థాన్ని తెలుసుకున్నా విజ్ఞానం చెందలేవు (సంపూర్ణంగా పొందలేవు) పరమార్థాన్ని తెలుసుకుంటేనే విజ్ఞానంతో పాటు అనుభవాన్ని తెలుసుకోగలవు
అర్థాన్ని తెలుసుకున్నా పరమార్థాన్ని తెలుసుకోవాలి అప్పుడే మేధస్సు విశ్వ విజ్ఞానంతో విస్తృతమౌతుంది
ఇంద్రియాల జ్ఞానంతో అర్థాన్ని తెలుసుకోగలవు - మేధస్సుతో విశ్వార్ధంతో ఆలోచిస్తేనే పరమార్థం తెలుస్తుంది
పరమార్థం పరిశుద్ధమైనది పరిశోధనమైనది పరిపూర్ణమైనది ప్రసిద్ధమైనది
అర్థం కొన్ని సంధర్భాలలో అనర్థం కావచ్చు (ఇంద్రియ విజ్ఞాన లోపం వల్ల) పరమార్థం లోక జ్ఞానంతో ఉంటుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment