Sunday, July 6, 2025

మరణించిన శరీరం నుండే ఎన్నో భావ తత్వాలను తెలుపగలనా

మరణించిన శరీరం నుండే ఎన్నో భావ తత్వాలను తెలుపగలనా 
అద్భుతమైన ఆలోచనలే ఆగిపోయే సమయాన ఆశ్చర్యమేమి మేధస్సుకే కలగలేదా 

మేధస్సులో ఏ నిర్ణయం ఉన్నదో ఏ భావ తత్వాలకు తెలుసునని ఆలోచనలే గ్రహించేనా 
నా శరీరం శూన్యమయ్యే దాకా పంచ భూతాలు తోడుగానే వస్తూ నేనే లేనని నన్నే అపహరించిపోవునా 

శరీరం ఇంకా జీవిస్తుందని దేహస్సుకే తెలిసి ఉంటే జీవం ఆత్మను వదిలి వెళ్ళిపోదేమో 
దేహాన్ని ధరించిన ఆత్మ జీవమై ఉన్నప్పుడు శరీరాన్ని వదిలి పోవుటలో జీవం పరమాత్మను స్మరించేనా 

శరీరానికి బంధాలెన్నో ఉన్నప్పుడు ఆత్మ పరమానందంతో ఎన్నో కార్యాలతో పరిశోధన చేస్తూ జీవించునా 
శరీరానికి బంధాలెన్నో ఉన్నప్పుడు ఆత్మకు భావ తత్వాలెన్నో జీవం శ్రమించుటలో దేహమే తెలుపునేమో 

ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు విడిపోయేలా శ్వాస ప్రయాసాలు ఆగిపోయేలా దేహం శరీరం నుండి విడిచిపోయి జీవంతో ఆత్మను పరమాత్మకు చేర్చునా 

జీవించుటలో ఉన్న అద్భుతం మరణించుటలో ఉన్న ఆశ్చర్యం మేధస్సుకే తెలిసిపోయే భావ తత్వాలెన్నో కాలమే దాచుకొనెనా జీవితాన్ని గుర్తుగా ఉంచుకొనెనా 


-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment