Thursday, July 31, 2025

ఆరోగ్యమా! నీవు నాలో ఎలా ఉన్నావు

ఆరోగ్యమా! నీవు నాలో ఎలా ఉన్నావు  

శ్రమించుటలో నీవు ఆరోగ్యంతోనే సాగుతున్నావుగా 

శ్రమించుటలో శరీరంలోని అన్ని అవయవాలు సామర్థ్యంతో సహనంతో సరిగ్గా పని చేస్తున్నాయిగా అలాగే శ్రమించిన తర్వాత తగిన విశ్రాంతి అందుతున్నదిగా 

నేను భుజించు ఆహారం నా శరీరానికి సరైన శక్తి సామర్త్యాలు ఉత్తేజవంతాన్ని కలిగిస్తున్నాయిగా 

శ్రమించుటలో ఆరోగ్యం ఉన్నప్పుడే నేను సాధనతో విజ్ఞానం చెందుతూ ఏదైనా సాధించగలను 

ఆరోగ్యం నన్ను రక్షిస్తూ నా కుటుంబాన్ని అభివృద్ధి పరిచేందుకు సహాయం చేస్తుందిగా 
ఆరోగ్యంతోనే ఎన్ని సమస్యలైనా పరిష్కారించేందుకు వీలుగా ఉంటుంది 

ఆరోగ్యమే ఎంతో కాలం జీవించడానికి ఉపయోగపడుతుంది ఎన్నో అనుభవాలతో ఎన్నింటినో వివిధ రకాలుగా భరిస్తూ ఓర్చుకుంటూ శ్రద్ధగా జీవితాన్ని సాగిస్తుంది  

పరిశుద్ధమైన ఆహారం కోసం పరిశుద్ధమైన ప్రకృతి పరిపూర్ణమైన పోషకాలతో అపూర్వమైన ఆరోగ్యంతో అభివృద్ధి చెందాలి 

కాలుష్యం లేని ప్రాంతమే ఆరోగ్యవంతమైన అద్భుతమైన ప్రశాంతమైన పరిపూర్ణమైన ప్రదేశం 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment