Monday, July 7, 2025

తడి ఉంటే చాలు రాయిలో నుండైనా వృక్షం ఉద్భవిస్తుంది పుష్పం వికసిస్తుంది

తడి ఉంటే చాలు రాయిలో నుండైనా వృక్షం ఉద్భవిస్తుంది పుష్పం వికసిస్తుంది  
రాయిలోనుండైనా పచ్చదనం జనించును పుష్పాలతో పరిమళం ప్రకాశించును 

మానవుడు స్వచ్ఛమైన ప్రాణ వాయువుతో జీవించుటకు బండరాయి కూడా పచ్చదనాన్ని జనింపజేస్తుంది 
ప్రకృతి ఎప్పుడూ మానవునికి సహాయం చేస్తూనే ఉన్నా మానవుడే ప్రకృతిని కాలుష్యంతో వృధా చేస్తున్నాడు (ఇతర జీవులకు కూడా అనారోగ్యాన్ని కల్పిస్తున్నాడు)

మానవుని మేధస్సు (విజ్ఞానం) కంటే ఇతర జీవులే గొప్ప ఎందుకంటే ఇతర జీవులు ప్రకృతిని కాలుష్యంగా వృధా చేయవు 

మానవుడు ముందుగా తనకు కావలసిన దానిని తాను సృష్టించుకుంటాడు ఆ తర్వాత వృధా వ్యర్థం నష్టం గురించి ఆలోచిస్తాడు (ఆలోచించినా వాటిని మళ్ళీ సరిచేసుకోడు, మళ్ళీ జరగకుండా చూసుకోడు, మళ్ళీ చేయకుండా ఉండలేడు)

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment