సూర్యుడే ప్రతి రోజు సూర్యోదయంతో ప్రతి జీవి మేధస్సును ఉత్తేజవంతమైన ప్రకాశంతో దివ్యమైన తేజస్సుతో వెలిగిస్తూ మెలకువ కల్గిస్తున్నాడు
సూర్యుడే ప్రతి రోజు సూర్యాస్తమయంతో ప్రతి జీవి మేధస్సును విరామ సమయ కాలంగా శాంతింపజేస్తూ అన్నింటిని చీకటిలో దాచేస్తూ నిద్రింపజేస్తున్నాడు
సూర్యుని ప్రకాశమే సర్వ కార్యాలకు పునాదిగా జీవన కార్యక్రమాలను సాగించేలా ప్రకృతిని ప్రభావితం చేస్తూ ఆహార సేకరణకు జీవుల చలనం సాగుతున్నది
ప్రకృతిలోనే సర్వం లభించేలా అనంత విధాలుగా ఎన్నింటినో సృష్టిస్తున్నాడు అలాగే ఆహార పదార్థాలకు జీవన విలాసాలకు ఎంతో అభివృద్ధిని కలిగిస్తున్నాడు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment