రహదారి ప్రమాదాలకు ఆకాశ వాహనాల ప్రదాలకు ఎందరో
ఇతర జీవులు కూడా ఇలాగే ఎన్నో విధాల అజ్ఞాన మరణమే
నేటి ఆహారమున నిరోధక శక్తి లేక శరీరము అనారోగ్యంగా
కాల ప్రభావాలకు కుప్పలు కుప్పలుగా చనిపోతూనే ఉన్నారు
మానవునికి ఎంత విజ్ఞానం ఉన్నా సరైన ప్రణాళిక జాగ్రత్తలు లేవు
వినేవారు ఒకరైతే అర్థం చేసుకునేవారు ఇంకొకరు తెలిపేవారు మరొకరు
చికిత్సలో కూడా లోటుపాట్లు మనుషులలోని భావోద్వేగాలకు మరణించే వారెందరో
ఆత్మ హత్యలు యుద్దాలు కొట్లాటలు యంత్రములకు ఎందరో చనిపోతూనే ఉన్నారు
అధిక జన సంఖ్యతో జీవించుట ఎందుకు అనంత రకాలుగా మరణించుట ఎందుకు
సహజ మరణానికి మంచి జీవితానికి విశ్వ రక్షణకై ధ్యానించండి విజ్ఞానంగా ఎదగండి
అన్ని సమస్యలకు అధిక సంఖ్యయే కారణము అలాగే ధ్యానమే పరిష్కార మార్గము
No comments:
Post a Comment