విజ్ఞానాన్ని మనస్సే మేధస్సులో అమర్చుతుంది
మనస్సే విజ్ఞానం కోసం విశ్వమంతా అన్వేషిస్తుంది
మనస్సే అన్ని భావాలను తిలకిస్తూ చలిస్తుంది
మనస్సే మనల్ని వివిధ రకాలుగా ఉంచగలుగుతుంది
మనస్సు ఎలా ఉంటే మన ప్రవర్తన అలా సాగుతూ ఉంటుంది
మనం ఎదిగే విజ్ఞానం కూడా మనస్సు పైననే ఆధారం
మనస్సే అజ్ఞానాన్ని కూడా కల్పిస్తుంది
ప్రతి కార్యాన్ని మేధస్సుతో ఆలోచించి పని చేయాలి
విజ్ఞానంగా మనం జీవించేందుకే మనస్సును గమనిస్తూ ఉండాలి
No comments:
Post a Comment