41 రోజులు - చాలా ప్రత్యేకమైనవి
ఓ దీక్ష ఓ మహా కార్యం ఓ మహా విజయానికి 41 రోజుల సాధన అవసరం
అజ్ఞానులు విజ్ఞానులుగా మారాలన్నా 41 రోజుల సాధన దీక్ష అవసరం
కొన్ని రోగాలు నయం కావాలన్నా రోగానికి కట్టిన కట్లు విప్పాలన్నా 41
మహా అపాయమైన పచ్చ కామెర్ల రోగానికి పత్యం ఉండవలసి వస్తే 41
భగవంతుని మాలలు ధరించిన వారు 41 రోజుల తరువాతే దీక్ష విరమణ
దీక్ష విరమణ చేసిన వారు మరల వారి అలవాట్లను సాగిస్తారు ఎందుకో
మన దేహం పంచభూతాల విశ్వ తత్వాన్ని పొందాలన్నా 41 రోజుల సాధన
దురలవాట్లను పూర్తిగా మానుకోవాలన్నా 41 రోజుల కఠిన దీక్ష అవసరం
ఈ అలవాట్లను మానుకున్న వారు మరల మొదలు పెడతారు ఎందుకో
41 రోజులు యోగ తత్వ ఆత్మ భావాలతో జీవిస్తే మీలో విశ్వ విజ్ఞానమే
"మాల ధరించి భగవంతునిలా జీవించి మరలా దీక్ష విరమణతో దురలవాట్లను అలవాటు చేసుకోవడం తన దేహాన్ని కాల్చుకోవడమే"
No comments:
Post a Comment