Sunday, December 19, 2010

ఆకాశంలో ఎక్కువ సమయం విహరించే

ఆకాశంలో ఎక్కువ సమయం విహరించే పక్షి గ్రద్ద యేనని నా భావన
గ్రద్ద విహరించే విధానంలో రెక్కలను చాలా తక్కువగా ఆడిస్తుంది
సరదా కలాపాలు ఆహార అన్వేషణ ఇతర కలాపాలు ఆకాశంలో విహరిస్తూనే
గ్రద్ద విహారించునట్లు ఏ పక్షి విహరించదని నేను తిలకించిన విధానం
గ్రద్దలు చాలా ఎత్తులో రెక్కలు ఆడించకుండానే తిరుగుతూ ఉంటాయి
మన మనస్సును గొప్పగా మెప్పించేలా వయ్యారాలతో విహరిస్తాయి
గ్రద్ద విహరించే విధానాన్ని తిలకిస్తే నేనూ అలా విహరించాలనే భావన
గ్రద్ధలా వివిధ రకాలుగా వివిధ విధానాలుగా ప్రయాణించాలానే నా భావన
గాలి పటంలా అలా తేలిపోతూ సమతుల్యతతో విహరిస్తూనే ఉంటుంది
గ్రద్ధ విహరించే విధాన భావ స్వభావాలన్నీ నా మేధస్సులో జ్ఞాపకంగా

No comments:

Post a Comment