ప్రయాణాన్ని మహా గొప్పగా ఆనాటి నుండి ఎన్నో విధాల సాగిస్తున్నా
సముద్రంలో ప్రతి చేపపై తాబేలు సర్పంపై వివిధ జల జీవులతో ప్రయాణిస్తున్నా
ఆకాశంలో ప్రతి పక్షిపై ప్రత్యేకంగా గ్రద్దపై వివిధ రకాలుగా ప్రయాణిస్తున్నా
గాలిలో అణువులతో వివిధ రకాల ధూళి కణాలతో ప్రయాణిస్తూనే ఉన్నా
భూమిపై ఎన్నో రకాలుగా ఎన్నో జంతువులతో మహా ఆనందంగా ప్రయాణిస్తున్నా
ఒంటెలపై ఏనుగులపై గుఱ్ఱాలపై వివిధ జంతువులపై ఆనాటి నుండి ప్రయాణిస్తూనే ఉన్నా
ఇంకా విశ్వమున సాంకేతిక యంత్రాల ద్వారా వాహనాల ద్వారా ప్రయాణిస్తున్నా
ఎక్కడెక్కడో ఎన్నో విధాల ఎన్నో రకాల ప్రతి క్షణం విశ్వాన్ని తిలకించుటకు ప్రయాణిస్తూనే ఉన్నా
No comments:
Post a Comment