నీవు లేనప్పుడు నీ ప్రదేశంలో ఏవైనా అజ్ఞాన కార్యాలు జరగి ఉంటే
నీవు మరల ఆ ప్రేదేశానికి వెళ్ళేటప్పుడు మెలకువతో వేచి ఉండాలి
నీ వారు ఉన్నా పక్కింటి వారు గాని తెలియని వారు గాని ఎవరైనా
ఎవరు చూడని సమయంలో ఏదో దొంగలించడం విరగొట్టడం చేస్తారు
తప్పు జరిగేటప్పుడే చూస్తేనే మనం వారిని పట్టుకోగలం ప్రశ్నించగలం
వారి అజ్ఞాన కార్యాలకు వారి మేధస్సు ప్రభావాలు విచక్షణ రహితమే
ఎవరు ఏ అజ్ఞాన కార్యాలు చేసినా వారి కర్మ ప్రభావాలు నా మేధస్సులో
అజ్ఞాన కార్యాలతో దొరగా తిరిగినా విశ్వ కర్మతో తప్పించుకోలేరు సుమా
జన్మ జన్మలుగా కర్మ వెంటాడుతూనే ఆత్మను మేధస్సుతో కాల్చేస్తుంది
No comments:
Post a Comment