Tuesday, December 21, 2010

నీకు సమస్యను కలిగించే వ్యక్తిపై

నీకు సమస్యను కలిగించే వ్యక్తిపై ద్వేషాన్ని పెంచుకోకు
ఆ సమయాన నీకు సమస్యపై ద్వేష భావాలు కల్గవచ్చు
భావాలు కలిగినంత మాత్రాన ద్వేషాన్ని మేధస్సున దాచుకోవద్దు
భవిష్యత్లో నీకు తాను మరోల ఎంతో ఉపయోగపడతాడు ఆలోచించు
నీలో స్నేహ గుణం ఉంటే నీకు మంచి సలహాలు ఉజ్వల భవిష్యత్ ను కల్పిస్తాడు
నీకు ప్రతి ఒక్కరు మార్గ దర్శకులే వివిధ సమస్యలపై వివిధ రకాలుగా స్పందిస్తారు
కాల ప్రభావాల వలన సమస్యలపై ఎన్నో భావాలు మీలో వారిలో కలుగుతూనే ఉంటాయి
ద్వేష భావాలు లేవంటే శత్రు భావాలు లేనట్లే అలా ఎన్నో భావాలు లేకపోతే తేడాలే కనిపించవు
సమయానికి ఏవి జరగాలో అలా కాలంతో జరిపోతుంటాయి మనం నిమిత్తులం మాత్రమే
మనకు ద్వేష భావాలు కలిగించినంత మాత్రాన అందరికి శత్రువు కాదు
మరొకరికి మిత్రుడిలా ఎందరికో ఎన్నో విధాల ఎన్నో భావాలను కలిగిస్తాడు
ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఎన్నో భావాలను ఎందరికో కలిగిస్తూ జీవిస్తున్నారు

No comments:

Post a Comment