కథలు చదివే కాలాలు వెళ్ళిపోతే భావాలను తెలుసుకునే కాలమే వస్తుంది
కథలలో ఏది ఎంత వరకు నిజమో ఎవరు ఎలా ఎందుకు అల్లారో తెలియదు
భావాలను సూక్ష్మంగా పరిశీలిస్తే మనకు స్వభావాలు స్పష్టంగా తెలుస్తాయి
చరిత్రలలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు ఎన్నో విధాల ఉండవచ్చు
చరిత్రలలో నైనా కథలలో నైనా విజ్ఞానాన్ని మాత్రమే గ్రహించేది భావనయే
భావాలను అర్థం చేసుకోవడానికి మీలో గుణ స్వభావాలు దివ్యంగా ఉండాలి
ఏ విషయంలోనైనా అజ్ఞాన విజ్ఞానాన్ని గుర్తించేది భావన స్వభావమే
విజ్ఞాన భావాలతో జీవించండి విశ్వ భావాలతో విజ్ఞానాన్ని తెలుసుకోండి
No comments:
Post a Comment