ఎన్నో కార్యాలను జ్ఞాపకంగా చేసుకుంటూ పోతున్నా మేధస్సులో మరుపే
మనలో ఉన్న కొన్ని కార్యాల వలన మరో కొన్ని కార్యాలను మరచిపోతాం
మరచిన కార్యాలు మరో సమయాన గుర్తుకు వస్తే తెలుస్తాయి మరచినట్లు
కొత్త కొత్త కార్యాలు మేధస్సులో చేరుతూ పాత కార్యాలను మరచిపోతున్నాం
పాత కార్యాలను వ్రాసుకొని ఓ ప్రణాళికను చేసుకొని సమయాన్ని కేటాయించాలి
పాత వాటిని ముగించుకుంటూ కొత్త వాటితో సాగిపోతూ ఉంటే మరుపు తగ్గును
వ్రాసుకోక పోయినా కొన్ని గుర్తులను పెట్టుకుంటే మనకు తోస్తాయి మరవనట్లు
అన్నీ కార్యాలను మేధస్సులోనే తలచుకుంటే కొన్ని మరచిపోవడం ఖచ్చితమే
No comments:
Post a Comment