కావలసిన వారికి కోరినవి అందక కోరిన వారికి కావలసినవి అందక
కోరుకోలేకున్నా కొందరికి కావలసినవి కోరుకోక ముందే వచ్చేస్తున్నాయి
కోరినవి అందని వారు చాలా తక్కువ స్థాయికి సంభంధించినవి కోరుకుంటారు
కావలసినవి ఉన్న వారు మరెన్నో కొత్త కోరికలతో కోరుకుంటూనే ఉన్నారు
కోరిక లేకపోతే జీవితం లేదేమో కోరుకోవడమే మేధస్సులో ఆలోచనగా
అప్పుడప్పుడే తీరేవి కొన్నైతే దీర్ఘ కాలంగా తీరేవి తీరక పోయేవి మరెన్నో
మేధస్సులో అన్వేషణ ఆశతో మొదలైనా అతిశయోక్తిగా ప్రయాణిస్తుంటుంది
No comments:
Post a Comment