Saturday, December 25, 2010

జీవితంలో కాలం వృధా

జీవితంలో కాలం వృధా అవుతుందనుకుంటే
నీలో శక్తి సామర్థ్యాలు ఇంకా ఉన్నాయనుకుంటే
సమాజానికి సహకారాలు అందించాలనుకుంటే
ఓ మహా గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసుకోండి
ప్రణాళికను క్రమ కార్యాలతో సాగేలా చూసుకోండి
లేనిపోని సమస్యలకు అవకాశం కల్పించకండి
సమస్యలను అప్పటికే పరిష్కారించి తొలగించండి
నీ ప్రణాళిక ఇంకా తర తరాలుగా సాగాలంటే
మహా వ్యక్తిని నిర్ణయించుకొని మీ అనుభవాలను తెలుపండి
ఎప్పటికి సాగే దీర్ఘ కాల ప్రణాళికలను నవ సమాజం కోసం ఎన్నుకోండి
మీలో శక్తి సామర్థ్యాలు లేకపోతే విశ్వ విజ్ఞానం కోసం ధ్యానించండి
మీకు కలిగే విశ్వ భావాల విజ్ఞానాన్ని సమాజానికి అందించండి
వృధా జీవితాన్ని దివ్యమైన జీవితంగా మార్చుకోండి

No comments:

Post a Comment