ఇంటికి వాస్తు ఉన్నదో లేదో ఆలోచిస్తున్నాము
కొత్త ఇంటికైతే అన్ని విధాల వాస్తును గమనిస్తున్నాము
మన కార్యాలు ఏవి ఫలించకపోతే ఇంటి వాస్తు సరిగ్గా లేదేమోనని అనుకుంటాము
వాస్తు లేనందున కాలం కూడా కలిసి రావటం లేదోమోనని ఆలోచిస్తూనే ఉన్నాము
వాస్తు బాగుందంటే ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాము ఏ స్థాయికి ఎదుగుతున్నాము
వాస్తు బాగున్నా ఆలోచనలలో సరైన విధానం లేకపోతే కాలం కలిసి రాదు కదా
ఓ కార్యానికి కావలసిన ఆలోచనల సామర్థ్యం మనలో లేకపోతే వాస్తు ప్రభావమేమిటి
మేధస్సుకు ఏ వాస్తు ఉన్నది ఏ ఆలోచనలలో వాస్తులు ఉన్నవి తెలుపగలరా
మేధస్సుకు వాస్తు అవసరమైతే మనిషి ఇక చలించడేమోనని అనిపిస్తుంది
వాస్తు అవసరమైతే ఆ విధంగా ఇంటిని నిర్మించుకోండి లేకపోతే గొప్పగా ఆలోచించండి
ప్రతి ఒక్కరు గొప్పగా మహా భావాలతో ఆలోచిస్తే జీవిస్తే జీవితం ప్రశాంతంగా సాగుతుంది
వాస్తు ఉండడం లేకపోవడం కాల నిర్ణయమే కావచ్చు ఆలోచనల ప్రభావం ఉండవచ్చు
విశ్వానికి వాస్తు ఉన్నదా ప్రకృతి ప్రదేశాలకు వాస్తు లేకపోతే సరి చేయడం వీలవుతుందా
వాస్తు వున్నా లేకున్నా సూర్య చంద్రులు మహా శక్తి భావాలతో విశ్వాన్ని జీవింపజేస్తున్నారు
No comments:
Post a Comment