గతమంతా పర ధ్యాసలోనే గడిచి పోయినట్లుందేమోనని నా భావన
విశ్వ విజ్ఞానం లేక విశ్వ తత్వాలు తెలియక ఆత్మ జ్ఞానాన్ని గ్రహించక
భావ స్వభావాలు తెలియక విచక్షణ గుణాల అర్థాలను తెలుసుకోలేక
ఏ రూపాన్ని సూక్ష్మ పరిశీలన చేయక గత జీవితమంతా పరధ్యాసలోనే
ఆలోచనలతో జీవించడం జీవన కార్యాలతో జీవించడం సామాన్యమే
మేధస్సును ఉజ్వల భవిష్యత్ కై ఉపయోగించడం విశ్వ విజ్ఞానమే
నీ మేధస్సు భావాలే భవిష్య యుగాలకు సంపూర్ణ విజ్ఞానాన్ని అందించాలి
No comments:
Post a Comment