Sunday, December 19, 2010

మేఘాల పొరలలో ఓ మహా పక్షి

మేఘాల పొరలలో ఓ మహా పక్షి వెళ్ళుతూ మబ్బులకు కనిపించటం లేదు
గాలులకు మేఘ రూపాల పరిణామ ప్రవాహాలలో వివిధ పొరలు మారుతూ
మళ్ళీ కొన్ని గడియలకు మరో దిక్కున నీలి ఆకాశంలో పక్షి కనిపిస్తున్నది
ఎంతో ఎత్తులో వెళ్ళిపోయి సూర్య కిరణాలకు మెరుస్తూ సాగుతున్నట్లున్నది
గమ్యం ఎలాంటిదో ఎక్కడికో ఆ రోజు కార్యాలు ఏమిటో ఆ పక్షికే మహా ఎరుక
మేఘాలలో కనిపించని పక్షుల విహార యాత్ర కలాపాలు నా మేధస్సులోని భావాలే

No comments:

Post a Comment